కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై తనదైశ శైలీలో స్పందించారు ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్ థాక్రే. ఎన్నికల్లో ఈవీఎంలు విజయం సాధించాయని…ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తం చేశారు. మొత్తం 222 స్ధానాలకు ఎన్నికలు జరుగగా బీజేపీ 104 స్థానాల్లో,కాంగ్రెస్ 78 ,జేడీఎస్ 38, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
జేడీఎస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్…ఈవీఎంల పనితీరుపై సందేహాలను వ్యక్తం చేసింది.ఈవీఎంలను టాంపరింగ్ చేశారని…బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఎందుకు సిద్దంగా లేదని ప్రశ్నించింది. ఈవీఎంలపై దేశంలోని పార్టీలన్నీ సందేహాలు వ్యక్తం చేశాయి. గతంలో బీజేపీ సైతం ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
మరోవైపు సీఎం పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయగా ….కాంగ్రెస్ పై మండిపడ్డారు బీజేపీ సీఎం అభ్యర్థి యాడ్యూరప్ప. ప్రజలు కాంగ్రెస్ ముక్త్ కర్నాకటకు ఓటేశారని….కానీ వారు మాత్రం అధికారం కోసం అడ్డదారిలో వెళ్తున్నారని విమర్శించారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను దూరం పెట్టి, బీజేపీని దగ్గరకు తీసుకున్నారని అన్నారు. బీజేపీకి మద్దతిచ్చిన కన్నడ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.