రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ ఫస్ట్ లుక్ రిలీజ్

244
rajugadu
- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, అమైరా దస్తూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజుగాడు’. సంజనారెడ్డి డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్బంగా చిత్రయూనిట్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ లో రాజ్‌తరుణ్‌ అమైరా దస్తూర్‌ హ్యాండ్‌ బ్యాగ్‌లోని సెల్‌ఫోన్‌ను దొంగిలిస్తున్నట్లు కనిపిస్తుంది.

Raju-Gadu-Movie-

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజిత‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, రావు రమేష్‌, నాగినీడు, పృథ్వీ, రాజా ర‌వీంద్ర‌, కృష్ణ‌భ‌గ‌వాన్‌, సిజ్జు, సుబ్బ‌రాజు, ప్ర‌వీణ్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి ఆర్ట్‌: కృష్ణ మాయ, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌, సంగీతం: గోపీ సుందర్‌, చీఫ్ కో డైరెక్ట‌ర్ః దాసం సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః కిషోర్ గరికిపాటి, సహ నిర్మాతలు: అజయ్‌ సుంకర, డా.డి.ల‌క్ష్మ‌ణ‌రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: సంజనారెడ్డి.

- Advertisement -