18న రాజ్‌ తరుణ్‌… స్టాండప్ రాహుల్

49
raj tharun
- Advertisement -

ప్రామిసింగ్ హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా స్టాండప్ రాహుల్. కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల మీద నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. షూటింగ్ పూర్త‌యి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ముగిశాయి. ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్‌ను, పాట‌ల‌ను శుక్ర‌వారంనాడు రామానాయుడు స్టూడియోలో విలేక‌రుల‌కు ప్ర‌ద‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా హీరో రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ, ఎంతో క‌ష్ట‌ప‌డి ఎంజాయ్ చేస్తూ చేశాం. మీరు చూసిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తార‌ని ఆశిస్తున్నారు. మీరంతా కుటుంబ‌స‌భ్యుల‌తో రెండు గంట‌లు వ‌చ్చి ఎంజాయ్‌చేయండి. అన్ని ఎమోష‌న్స్‌కూ క‌నెక్ట్ అవుతారు. మార్చి 18న థియేట‌ర్లో సినిమాను చూడండి. పైర‌సీని ఎంక‌రేజ్ చేయ‌కండి అని తెలిపారు.

క‌థానాయిక వ‌ర్ష మాట్లాడుతూ, మిడిల్ క్లాస్ మెలోడిస్ కు ముందే నాకు శాంటో ఈ సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. చాలా థ్యాంక్స్‌. మంచి నిర్మాత‌లు ఈ సినిమా తీశారు. నేను ప‌నిచేసిన కో స్టార్‌లో రాజ్‌ త‌రుణ్ స్వీట్ ప‌ర్స‌న్‌. మ‌నాలిలో షూట్ చేస్తున్న‌ప్పుడు కాస్ట్యూమ్స్ విష‌యంలో ఇబ్బంది ఎదురైంది. అప్పుడు రాజ్ గ్ర‌హించి వెంట‌నే సాల్వ్ చేశాడు. ఇందులో సాంగ్స్ బాగున్నాయి. ఈశ్వ‌ర్ మాస్ట‌ర్ ఈ సినిమాకు బెస్ట్ మేన్ అని చెప్ప‌గ‌ల‌ను అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ, ఈ క‌థ చెప్ప‌గానే ఇష్ట‌ప‌డి ఆ త‌ర్వాత పాండ‌మిక్ వ‌ల్ల క‌ష్ట‌ప‌డి హాపీగా చేశాం. ద‌ర్శ‌కుడు శాంటో క‌థ చెప్ప‌గానే మొద‌టి సిట్టింగ్‌లో ఓకే అయింది. హీరో రాజ్ త‌రుణ్ చాలా స‌పోర్ట్ చేశాడు. ఈ క‌థ‌కు వ‌ర్క్ షాప్ కూడా చేశాడు. వ‌ర్ష పాత్ర ప‌రంగా బాగా న‌ప్పింది. శ్రీ‌క‌ర్ ప్ర‌తీపాటా భిన్నంగా చేశారు. మార్చి 18న విడుద‌ల చేస్తున్నాం అన్నారు.

డైలాగ్స్ నంద‌కిశోర్ మాట్లాడుతూ, ద‌ర్శ‌కుడు శాంటోకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నా. ఈ చిత్రంలో వ‌ర్ష చాలా మంచి పాత్ర పోషించింది. రెండేళ్ళ‌నాడు సినిమా ప్రారంభించాం. చాలా ఫ‌న్ సినిమా. థియేట‌ర్లో హౌస్‌ఫుల్ బోర్డుతో వుంటాయ‌ని ఆశిస్తున్నాను అన్నారు.

ద‌ర్శ‌కుడు శాంటో మాట్లాడుతూ, రాజ్ త‌రుణ్ కు ఇది 15 సినిమా. అయినా తొలి సినిమాలాగా ఆడిష‌న్ చేయ‌డం విశేషం. వ‌ర్క్‌షాప్‌కూడా చేసి మంచి ఔట్‌పుట్ ఇచ్చాడు. ఓసారి థియేట‌ర్‌లో చూసీచూడంగానే సినిమా చూశాక త‌ను బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్పుడు ఆమెను చూసి నా క‌థ‌కు స‌రిపోతుంద‌ని ఫిక్స్ అయ్యాను. తెలుగురాక‌పోయినా డిక్ష‌న్ బాగా నేర్చుకుని పలికింది. అలాగే ఇత‌ర టెక్నీషియ‌న్స్ కూడా న‌చ్చి ఎంపిక చేశాను. శ్రీ‌క‌ర్ నాకు కేరాఫ్ కంచెర‌పాలెంనుంచి తెలుసు. ఇందులో 6 పాట‌లున్నాయి. అందులో అలా ఇలా.. అనేది నా ఫేవ‌రేట్ సాంగ్‌. త్వ‌ర‌లో విడుద‌ల చేస్తాం. ఈ సినిమా క‌థ వైజాగ్ నేప‌థ్యంలో వుంటుంది. ఈ సినిమా క‌థ రాసుకున్న‌ప్పుడు నా లైఫ్‌లో చూసిన వారిని ఇందులోకి తెచ్చాను. ముర‌ళీ శ‌ర్మ‌, ఇంద్ర‌జ గారు బిజీ ఆ ర్టిస్టుల‌యిన క‌థ చెప్ప‌గానే వెంట‌నే అంగీక‌రించి స‌పోర్ట్ చేశార‌ని పేర్కొన్నారు.

మ‌రో నిర్మాత భరత్ మాగులూరి తెలుపుతూ, సిద్దు నేను స్నేహితులం. గ‌తంలో క‌థ‌ను రెండు మూడు సార్లు విని ఆలోచించేవాళ్ళం. కానీ ఈ క‌థ విన్న వెంట‌నే చేయాల‌నిపించింది. శ్రీ‌క‌ర్ బాణీలు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయ‌ని పేర్కొన్నారు.తేజ‌స్వి మాట్లాడుతూ, ఇది నా తొలి సినిమా. రెండేళ్ళ‌నాడు ఆడిష‌న్ చేసి తీసుకున్నారు. రోర్ కోస్ట‌ర్ మూవీ. థియేట‌ర్‌లో చూసి ఎంజాయ్ చేయండి అన్నారు.కొరియోగ్రాఫ‌ర్ ఈశ్వ‌ర్ మాట్లాడుతూ, శ్రీ‌క‌ర్ చ‌క్క‌టి బాణీలు ఇచ్చారు. ప్ర‌తి పాటా అన్ని పాట‌లు ఇచ్చిన నందు గారికి థ్యాంక్స్‌. సినిమా చాలా బాగుంది. పాట‌లు మ‌రింత బాగుంటాయి అన్నారు.ఈ మూవీలో వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్, మధురిమ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

- Advertisement -