వింత జబ్బుతో ‘రాజుగాడు’

238
- Advertisement -

కొత్త కథలను, సరికొత్త పాత్రలను ఎన్నుకుంటూ.. యూత్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్న యువహీరో రాజ్ తరుణ్.‘అంధగాడు’ తర్వాత రాజ్ తరుణ్.. ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బేనర్లోనే మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా పేరు ‘రాజు గాడు’. సంజన రెడ్డి అనే లేడీ డైరెక్టర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇందులో ఏ దురుద్దేశం లేకుండా చిలిపి దొంగతనాలు చేసి చిక్కుల్లో పడే పాత్రలో కనిపించబోతున్నాడు రాజ్ తరుణ్‌. ఇంతకుముందు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో కుక్కల్ని దొంగిలించే పాత్రలో ఎంటర్టైన్ చేసిన రాజ్ తరుణ్ కు.. ఈసారి కూడా అలాంటి ఫన్నీ క్యారెక్టరే పడ్డట్లుంది. ‘అంధగాడు’లో బ్లైండ్ క్యారెక్టర్లో కూడా రాజ్ తరుణ్ బాగానే నవ్వించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే రాజ్.. అనిల్ సుంకర నిర్మాణంలో మూడు సినిమాలు చేశాడు. ‘రాజు గాడు’ ఆ బేనర్లో అతడికి నాలుగో సినిమా కావడం విశేషం.

Raj Tarun as Sanjana's "Raju Gadu"

అయితే రాజ్ చేయబోయే పాత్ర..సూర్య స్వీయ నిర్మాణంలో తమిళంలో ‘పసంగ-2’ పేరుతో తీసిన సినిమా తెలుగులో ‘మేము’ పేరుతో అనువాదమైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో రామ్ దాస్ అనే నటుడు చేసిన పాత్ర భలే ఫన్నీగా ఉంటుంది. పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ.. అతడికి చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటుంటుంది. తన కంపెనీ తరపున 5 స్టార్ హోటల్లో కాన్ఫరెన్సుకు వెళ్లి.. అక్కడ లంచ్ చేసేటప్పుడు స్పూన్లు అవీ దొంగిలిస్తాడతను. ఇదో రకం వింత జబ్బన్నమాట.

అలాంటి పాత్రనే ఇక్కడ రాజ్‌ తరుణ్‌ చేయబోతున్నాడు ఈ సినిమాలో హీరోకి ‘క్లెప్తమేనియా’ అనే వింత జబ్పు ఉంటుందాట.దానివల్లే హీరో చిన్న చిన్న దోంగతనాలు చేస్తుంటాడు. అవసరం వున్నా లేకపోయినా చిన్న చిన్న దొంగతనాలు చేసేయడం ఈ రోగ లక్షణమట. అలాంటి ఈ రోగ లక్షణం వలన ఆయన ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందనే కథాంశంతో ‘రాజుగాడు’ సినిమా రూపొందనుంది. వైవిధ్యభరితమైన కథా కథనాలతో రూపొందనున్న ఈ సినిమా, తనకి మరింత క్రేజ్ ను తీసుకురావడం ఖాయమనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు.

- Advertisement -