స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ

19
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ జారీ చేయగా ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించింది విద్యాశాఖ. హైదరాబాద్‌తో పాటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది.

అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి ఎవరూ బయటికి రావద్దు అని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కుండపోత వానతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

Also Read:హ్యాపీ టీచర్స్ డే..

గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి . మంగళ, బుధ వారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.

Also Read:ఉదయాన్నే తలనొప్పి వస్తే..ఇలా చేయండి!

- Advertisement -