- Advertisement -
నిన్న విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు దానిని ఆనుకొని ఉన్న విదర్భ ప్రాంతాలలో 0.9 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి కర్ణాటక తీరం నుండి అంతర్గత కర్ణాటక మరియ దక్షిణ-మధ్య మహారాష్ట్ర మీదుగా మరత్వడా వరకు 0.9 కి.మీ ఎత్తు వరకు కేంద్రీకృతమై ఉన్నది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. రాగాల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
- Advertisement -