అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

1
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండగా దీని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.

మరోవైపు చలి తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

Also Read:ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలులో వేస్తారా?:పోసాని

- Advertisement -