తెలంగాణలో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు..

183
rain
- Advertisement -

తూర్పు- పశ్చిమ shear zone Lat.10.0 deg.N వెంబడి 2.1 km నుండి 5.8 km ఎత్తు మధ్య ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నది. నైఋతి బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో 2.1 km నుండి 4.5 km ఎత్తు మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం పైన తెలిపిన shear zoneతో విలీనం అయ్యింది. బీహార్ నుండి తూర్పు విదర్భ వరకు ఉత్తర చత్తీస్ గఢ్ మీదుగా 3.1 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజులు వర్ష సూచన నెలకొందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అలాగే రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

- Advertisement -