రెండో టీ20లోనూ టీమిండియా గెలిచేనా?

47
- Advertisement -

భారత్ – ఆసీస్ మధ్య ఇవాళ రెండో టీ20 జరగనుంది. కేరళలోని తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా వరణుడు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. అయితే ఒకవేళ వరణుడు కరుణిస్తే మ్యాచ్ హోరాహోరిగా సాగే అవకాశం ఉంది.

మ్యాచ్ జరిగే గ్రీన్ ఫీల్డ్ మైదానంలో గ‌త కొద్ది రోజులుగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.

జట్ల అంచనా..

టీమ్ఇండియా : రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ

ఆస్ట్రేలియా: మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లీస్, మార్కస్ స్టొయినిస్, టీమ్ డేవిడ్, ఆరోన్ హార్దీ, మాథ్యూ వేడ్(కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెండార్ఫ్, తన్వీర్ సంఘా.

Also Read:మొబైల్ యాప్‌తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు..

- Advertisement -