తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఆగస్టు 2 నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడితే ఆగస్టు 5 తరువాత తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఇటీవలె తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read:పీఎం కిసాన్ 20వ విడత నిధులు రిలీజ్

