ఆగ్నేయ,పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. దీనికి తోడు ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అదేవిధంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మెదక్, కామారెడ్డి, జనగామ, సిద్ధిపేట, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు , రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Also Read:కలెక్టర్లతో సీఎం రేవంత్ రివ్యూ