రెయిన్ అలర్ట్..రాష్ట్రానికి మళ్లీ భారీ వర్ష సూచన!

3
- Advertisement -

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దాని ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

ఇవాళ నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మహబాబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో పాటుగా ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలాగే విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు.

Also Read:లక్నో స్మార్ట్ సిటీని సందర్శించిన మేయర్ బృందం

- Advertisement -