రేపటి నుంచి వచ్చే 3 రోజుల పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో విస్తృత స్థాయిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి అని వెల్లడించింది.
తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ లో సాయంత్రం, రాత్రి సమయంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కొద్ది సేపు భారీగా, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జులై 27 వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత వర్షపాత పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
Also Read:త్వరలో #VT15 ఫస్ట్ లుక్

