జూన్ 1 నుండి దేశవ్యాప్తంగా రైళ్లు నడవనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇవాల్టి నుండి బుకింగ్స్ మొదలుకాగా రోజువారీ రాకపోకలు సాగించే 200 రైళ్లను రైల్వేబోర్డు ఖరారు చేసింది. జోన్లు, రూట్ల వారీగా నడిపే రైళ్లు, ప్రయాణ వేళల వివరాల్ని వెల్లడించింది.
గతంలో మాదిరే స్లీపర్, ఏసీ, జనరల్ బోగీలు ఉంటాయి. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు.
తెలుగు రాష్ట్రాల నుంచి రోజూ నడిచే రైళ్లు: (సికింద్రాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి)హైదరాబాద్- విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727/28),ముంబయి-హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02), హావ్‌డా- సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (02703/04), హైదరాబాద్- న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (02723/24), దానాపూర్- సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92), విశాఖపట్నం- ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (02805/06), గుంటూరు- సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (07201/02), తిరుపతి- నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02793/94).
దురంతో రైళ్లు: సికింద్రాబాద్- హజ్రత్ నిజాముద్దీన్ (02285/86) (వారానికి రెండుసార్లు)

