Raid 2: వసూళ్లు అదరిపోవాలంతే!

21
- Advertisement -

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఆదాయపు పన్ను అధికారిగా “రైడ్ 2″లో అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించబోతున్నారు. రైడ్ చిత్రానికి సీక్వెల్‌గా వస్తుండగా రాజ్ కుమార్ గుప్తా ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేశారు.

ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓపెనింగ్ డేకు దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ చైన్స్ (పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్) లో సుమారు 86,000 టికెట్లు అమ్ముతూ మంచి అడ్వాన్స్ బుకింగ్స్‌ను నమోదు చేసింది. ఇది అజయ్ దేవగన్ సూపర్‌హిట్ “శైతాన్” కంటే క్కువ. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, “రైడ్ 2” మొదటి రోజు రూ. 15 కోట్ల నుండి రూ. 17 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

బుక్ మై షోలో కనిపించిన ట్రెండ్‌ను పరిశీలిస్తే ఈ అంచనా సాధ్యమేనని తెలుస్తోంది. మొదటి రోజు కలెక్షన్ రూ. 20 కోట్ల నెట్ మార్క్‌ను తాకే అవకాశం లేకపోలేదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రాన్ని పానోరమా స్టూడియోస్ మరియు టీ-సిరీస్ ఫిలింస్ నిర్మించగా, సంగీతాన్ని అమిత్ త్రివేది అందించారు.

Also Read:మేడేనే కాదు గుజరాత్ ఆవిర్భావ దినోత్సవం..

- Advertisement -