ఛాన్స్ కోసం పడుకొమ్మంటారు…

194
Lakshmi rai
- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఈ మాట దాదాపు గత సంవత్సర కాలంగా తరచూ వినిపిస్తూనే ఉంది. ఇదివరలో ఎప్పుడూ మాట్లాడని హీరోయిన్లు ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. సినీ పరిశ్రమలో ఈ చీకటి దందా గురించి ఇటీవ‌లి కాలంలో పెద్ద చర్చే జరుగుతోంది.హాలీవుడ్ లో ఓ బడా నిర్మాత హీరోయిన్స్ ని వేధిస్తున్నాడనే విషయం బయటపడినప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హీరోయిన్స్ అందరు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

laxmi_rai_

ముఖ్యంగా ఇండియాలో అయితే సినీ హీరోయిన్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ విషయం గురించి చెప్పారు. కొందరు మీడియా ముందుకు వచ్చి అప్పట్లో నేను కూడా అలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని చెప్పారు.అయితే అదే తరహాలో హాట్ బ్యూటీ లక్ష్మి రాయ్ కూడా పెదవి విప్పింది. అవును కాస్టింగ్ కౌచ్ సంస్కృతి ఇంకా ఉంది. ఎటువంటి సపోర్ట్ లేకుండా హీరోయిన్ అవుదామని కొత్తగా వచ్చే అమ్మాయిలకు అవకాశం రావాలంటే తెర వెనుక కోరిక తీర్చాల్సిందే అని డైరెక్ట్ గా చెప్పేసింది. అయితే తనకు ఇలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయని కానీ వాటిని నేను తిరస్కరించానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడు చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు కొంత మంది సీనియర్ హీరోయిన్స్ కూడా ఇదే తరహా అనుభవాలను చూశామని వివరించారు.

- Advertisement -