దేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభ రోజురోజుకు తగ్గుతుందా? ..వచ్చే 50 ఏళ్ల పాటు కేంద్రంలో బీజేపీ జెండా ఎగరేయాలని భావిస్తున్న కమల నాథుల కల..కలగానే మిగలనుందా..? అంటే అవుననే అంటోంది తాజా సర్వే. నోట్ల రద్దు, జీఎస్టీ, మేకిన్ ఇండియా వంటి కీలక విషయాలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని కలలు గంటున్న బీజేపీకి ఇప్పుడు ఓ సర్వే కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.
గతేడాది ప్రజాదరణలో దూసుకుపోయిన మోడీ పాలనపై ప్రజల్లో రాను రాను అసంతృప్తి పెరిగిపోతోందని సర్వేలో వెల్లడైంది. ఈసారి ఎన్నికల్లో మోడీ ప్రభంజనం ఉండదని కుండబద్దలు కొట్టింది. మరోవైపు రాహుల్‌పై ప్రజల్లో ఆదరణ రోజురోజుకి పెరిగిపోతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించక ముందు రాహుల్‌కు 8 శాతం మద్దతు తెలపగా అధ్యక్షుడైన తర్వాత రాహుల్ ప్రధానమంత్రి అవుతారని 27 మంది అభిప్రాయపడ్డారు. మరోవైపు మోడీ ఆదరణ 37 శాతం నుంచి 24శాతానికి పడిపోయింది.
అంతేగాదు మోడీకి ఆదరణ తగ్గడానికి జీఎస్టీ,నోట్ల రద్దుతో పాటు నిరుద్యోగ సమస్య ప్రభావం చూపిందని వెల్లడించింది. ఇక దక్షిణభారతదేశంలోనూ మోడీ ప్రభావం చూపే అవకాశం తక్కువని వెల్లడైంది. ఇదే సమయంలో రాహుల్‌కు ఎక్కువశాతం మంది మద్దతు తెలపడంపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇంకా ఎన్నికలకి సంవత్సరం సమయం ఉండటంతో మోడీ ఆదరణ మరింత తగ్గే అవకాశం ఉంది.