నాందేడ్‌ బరిలో రాహుల్‌..!

243
rahul gandhi nanded
- Advertisement -

లోక్‌ సభ ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్‌లో జరిగే లోక్‌ సభ ఎన్నికలకు ఇప్పటినుండే సమాయత్తం అవుతున్నాయి కాంగ్రెస్,బీజేపీ. ఈ నేపథ్యంలో వ్యూహాలకు పదునుపెడుతున్న కాంగ్రెస్ సరికొత్త స్టాటజీని ఫాలో అవుతోంది. మోడీ తరహాలోనే రెండు స్ధానాల నుండి రాహుల్‌ను పోటీచేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

కాంగ్రెస్ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతో పాటు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న నాందేడ్ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఈ సారి బరిలో నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే యూపీ తరువాత 48 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న మహారాష్ట్ర నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దీంతో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

రాజకీయనాయకులు రెండు చోట్ల పోటీ చేయడం కొత్తేమీ కాదు. పార్టీకి పట్టు వున్న ప్రాంతాల నుండే ఆయా నాయకులు ఆయా ప్రాంతాల నుండి పోటీలకు దిగుతుంటారు. దీనికి ఏ పార్టీగానీ..ఏ నాయకుడు గానీ అతీతం కాదు. 2014 ఎన్నికల్లో సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌లోని వడోదరతో పాటు..ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కూడా ప్రధాని ప్రధాని నరేంద్రమోడీ పోటీ చేసి మెరుగైన ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని రాహుల్ అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు.

- Advertisement -