లిప్‌లాక్‌తో పెళ్లి మ్యాటర్ రివీల్!

136
rahul
- Advertisement -

రాహుల్ రామకృష్ణన్…అర్జున్‌రెడ్డి సినిమాతో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన రాహుల్ రామ‌కృష్ణ‌.. జాతిర‌త్నాలు, హుషారు సినిమాల్లో కామెడీ క్యారెక్ట‌ర్స్‌తో ప్రేక్ష‌కుల్ని న‌వ్వించారు. తెలంగాణ యాస‌లో డిఫ‌రెంట్ బాడీలాంగ్వేజ్‌తో కామెడీని పండించే రాహుల్ వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌ అయిపోయారు.

రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్‌తో ప్రేక్షకులను మెప్పించిన రాహుల్..తాజాగా తన పెళ్లి మ్యాటర్‌ని వెరైటీగా రివీల్ చేశారు. తనకు కాబోయే భార్యకి లిప్ లాక్ ఇస్తూ తీసిన ఫోటో పోస్ట్ చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. రాహుల్ రామ‌కృష్ణ‌కు ప‌లువురు అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

- Advertisement -