దేశంలో బిగ్గెస్ట్ బఫూన్ రాహుల్ గాంధీ అని మండిపడ్డారు తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్. అసెంబ్లీ రద్దు అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్‌లో ప్రధానిని కౌగిలించుకోవడం ఏం పద్దతని ప్రశ్నించారు. ఉన్న తెలంగాణను ఉడగొట్టిన నియంత నెహ్రు అయితే తెలంగాణను కాలరాసిన మరో నియంత ఇందిరాగాంధీ అన్నారు. కాంగ్రెస్ నాయకుల టికెట్లు ఢిల్లీలో డిసైడ్ అవుతాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్నికూటములు కట్టినా గెలుపు టీఆర్ఎస్‌దే అని స్పష్టం చేశారు.
సర్వేల్లో ప్రతిపక్షపార్టీలు మాకు దరిదాపులో కూడా లేవన్నారు. 11 మందిని గెలిపిస్తే సంపద పెంచాలి-పంచాలి అనే నినాదంతో ముందుకు పోతామన్నారు. ఎంఐఎం-టీఆర్ఎస్ ఫ్రెండ్లీగా ఎన్నికల్లో ముందుకువెళ్తామన్నారు. ఎన్నికల్లో గెలిచేది ఎవరో ప్రజల్లోనే తేల్చుకుందామన్నారు కేసీఆర్.
ఆరునూరైన తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే ముందస్తు ఎన్నికలకు పోతున్నామని తెలిపారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. అవాకులు,చవాకులు పేలుతు అడ్డగొలు మాటలు మాట్లాడటం సరికాదన్నారు. విపక్షాలు ఇప్పటివరకు ఏ ఒక్క ఆరోపణను రుజువుచేయలేకపోయిందన్నారు. రాజకీయాల్లో అసహనం మంచిదికాదని సూచించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది విచ్చలవిడి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆరునూరైన తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదన్నారు.