ప్రజల గొంతు నొక్కుతున్న మోడీ సర్కార్!

63
rahul
- Advertisement -

దేశంలోని మోడీ సర్కార్ ప్రజల గొంతు నొక్కుతుందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. లండ‌న్ కేంబ్రిడ్జి యూనివ‌ర్శిటీలో జ‌రుగుతున్న ఐడియాస్ ఆఫ్ ఇండియా అన్న కార్య‌క్ర‌మంలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్..బీజేపీకి, కాంగ్రెస్‌కు మ‌ధ్య సైద్ధాంతిక యుద్ధం న‌డుస్తోంద‌ని అభివ‌ర్ణించారు. బీజేపీ, ఆరెస్సెస్ భార‌త్‌ను కేవ‌లం ఓ భూభాగంగానే చూస్తాయ‌ని, తాము మాత్రం దేశాన్ని ప్ర‌జ‌ల రూపంలో కొలుస్తామ‌ని చెప్పుకొచ్చారు.

గ‌తంలో భారత దేశం వుండేదో.. ఆ దేశం కోసం తాము ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని చెప్పారు. మోదీ పాల‌న‌లో నిరుద్యోగం విప‌రీతంగా పెరిగిపోయింద‌ని, అందుకే ఓట్ల కేంద్రీక‌ర‌ణ వైపు బీజేపీ దృష్టి సారిస్తోంద‌ని విమర్శించారు. ప్ర‌జా గొంతుక‌ను వినిపించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

- Advertisement -