ఆర్ఎస్ఎస్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఊరట లభించింది.ఆర్ఎస్ఎస్, బిజెపి లపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గౌరీ లంకేష్ హత్య చేయబడ్డారని రాహుల్ వ్యాఖ్యానించారు. దీంతో రాహుల్‌పై ఆర్‌ఎస్ఎస్ కార్యకర్త పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
ఈ కేసులో ఇవాళ విచారణకు రాహుల్ హాజరుకాగా 15వేల పూచీకత్తు తో బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఒక సంస్థ సిద్దాంతాన్ని విభేదించినందుకే తనపై కేసు నమోదుచేశారని చెప్పారు రాహుల్. ప్రజల పక్షాన పోరాడుతున్న తనపై ఆలాంటి కేసులు ఎన్ని దాఖలైతే అంత ఎక్కువగా పోరాడుతానని వెల్లడించారు. నాపై దురుద్దేశపూర్వకంగా జరిగే దాడిని సమర్ధవంతంగా ఎదుర్కొంటానని ప్రకటించారు రాహుల్.
నిన్ననే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్.. తన లేఖలో బీజేపీతో సిద్ధాంతపరమైన పోరును కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. 2017 సెప్టెంబర్‌లో బెంగుళూరులో గౌరీ లంకేశ్ హత్యకు గురైంది. ఇదే కేసులో సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి కూడా కోర్టుకు హాజరయ్యారు.