7న రాహుల్ పాదయాత్ర బహిరంగసభ..

144
rahul
- Advertisement -

ఈ నెల 7న రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర బహిరంగ సభ ఉంటుందని తెలిపారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాహుల్ పాదయాత్రకు సంబంధించి నిజాం సాగర్ షుగర్ ఫ్యాక్టరీ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్…7న రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ముగుస్తుందని ఈ సందర్భంగా భారీ బహిరంగసభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 5,6 తేదీల్లో మాత్రమే పాదయాత్ర కొనసాగుతుందని, 7న భారీ బహిరంగ సభతో వీడ్కోలు సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.

రాహుల్ యాత్ర మక్తల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ సమాజం ఆయనకు అండగా ఉందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించినా.. దాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు కృషి చేశారని చెప్పారు. 7వ తేదీ రాత్రి దెగ్లూరులో రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలో అడుగుపెడుతుందన్నారు.

- Advertisement -