లాక్‌డౌన్ అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలి: రాహుల్

309
rahul
- Advertisement -

లాక్ డౌన్ అమలు చేయడానికి రాష్ట్రాలకు కూడా అధికారం ఇవ్వాలని కేంద్రానికి సూచించారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాహుల్..కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ ఒక్కటే సరిపోదన్నారు.

కరోనాపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందని..లాక్‌డౌన్‌ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందన్నారు.  ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశముంది..కరోనాతో  పోరాటానికి వైద్య పరీక్షలు గణనీయంగా పెంచాలన్నారు.

ప్రస్తుతం వ్యూహాత్మకంగా వైద్య పరీక్షలు జరగట్లేదు,ర్యాండమ్‌ పద్ధతిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. కేరళలో జిల్లా స్థాయి వైద్య పరికరాలతో సమర్థంగా కట్టడి చేస్తున్నారని… వయనాడ్‌లో కరోనా నియంత్రణ సమర్థంగా జరుగుతోందన్నారు. కరోనాపై పోరులో కేరళ తీసుకున్న జాగ్రత్తలు అన్ని చోట్లా తీసుకోవాలి.

రోజువారీ కూలీలు, కార్మికులు ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నారన్న రాహుల్…చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి ప్రణాళికలు రచించాలని సూచించారు. కరోనాపై పోరులో అందుబాటులో ఉన్న వనరులన్నీ వినియోగించుకోవాలి…తొలుత పేదలు, కూలీల ప్రాణాలు కాపాడాలి. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించాలన్నారు. ప్రతి వారం 10 కిలోల గోధుమలు, బియ్యం, ఒక కిలో చక్కెర, ఒక కిలో పప్పులు పేదలకు ఇవ్వాలన్నారు.

- Advertisement -