- Advertisement -
టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కరోనా నుండి కోలుకున్నారు. దీంతో ఇవాళ సాయంత్రం దాయాది పాక్‌తో జరిగే మ్యాచ్‌కు ముందే జట్టుతో చేరనున్నారు ద్రావిడ్. ఈనెల 23న ద్రవిడ్‌కు కరోనా నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించగా ద్రావిడ్ స్థానంలో లక్ష్మణ్‌ని కోచ్‌గా నియమించగా ఇవాళ జట్టుతో చేరారు ద్రావిడ్.
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ వందో టీ20 ఆడనున్నాడు.
- Advertisement -