టాప్ – 3 గురించి బెంగ అవసరం లేదు: ద్రావిడ్

52
dravid
- Advertisement -

భారత స్టార్ క్రికెట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కొంతకాలంగా ఫామ్ కొల్పోయి పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 9న దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో తలపడనుంది భారత్.

ఈ నేపథ్యంలో మీడియాతో వివరాలను వెల్లడించారు ద్రావిడ్. అన్ని సందర్భాల్లో బ్యాటర్లు విధ్వంసకర రీతిలో ఆడాల్సిన అవసరం లేదని…మా టాప్‌–3 బ్యాటింగ్‌ నైపుణ్యం గురించి మాకు బాగా తెలుసు. వాళ్లు అత్యుత్తమ ఆటగాళ్లు. పరిస్థితులకు తగినట్లుగా ఆడటం అన్నింటికంటే ముఖ్యం అన్నారు.

సీనియర్లకు తగినంత విశ్రాంతి అవసరమని…రోహిత్‌కు విశ్రాంతినివ్వడంలో ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. తనకు తెలిసి ఐపీఎల్‌లో కెప్లెన్‌గా రాణించడం అంటే ఆటగాళ్లుగా ఒక మెట్టు ఎదిగినట్లే లెక్క. అది భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుంది. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా పాండ్యాగా ఎంతో ఆకట్టుకున్నాడు. అతని మళ్లీ జట్టులోకి రావడం, బౌలింగ్‌ కూడా చేస్తుండటం సంతోషకరం అన్నారు.శాంసన్, రాహుల్, శ్రేయస్‌ కూడా సారథులుగా మంచి లక్షణాలు ప్రదర్శించారు అని కొనియాడారు.

- Advertisement -