ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో మిస్టర్ వాల్..

244
dravid
- Advertisement -

టీమిండియా మాజీ క్రికెటర్,ది వాల్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్‌లో అద్భుత ప్రతిభ కనబర్చిన వారికిఇచ్చే ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ద్రవిడ్ హాజరుకాలేకపోయాడు.

తనకు లభించిన గౌరవం పట్ల ద్రవిడ్ సంతోషంవ్యక్తం చేశాడు. క్రికెట్‌లో రాణించేందుకు ప్రోత్సహించిన కుటుంబసభ్యులు,ఫ్రెండ్స్‌,తోటి ఆటగాళ్ల వల్లే ఈ ఘనత సాధించానని చెప్పారు. అదేవిధంగా ఐసీసీ,బీసీసీఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కొన్ని కమిట్‌మెంట్స్ వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయానని తెలిపాడు.

ద్రవిడ్‌తో పాటు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్,ఇంగ్లాండ్ మాజీ క్రీడాకారిణి కేర్లీ టేలర్‌ కూడా ఈ అరుదైన గౌరవం దక్కించుకుంది. భారత్‌ నుంచి హాల్‌ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదో ఆటగాడుగా ద్రవిడ్ నిలిచాడు.

ప్రస్తుతం భారత అండర్‌-19, భారత-ఎ జట్లకు ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. 1996లో అంతర్జాయతీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. ముఖ్యంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కడే ఒంటరిపోరాటం చేసి ది వాల్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ద్రవిడ్ కోచ్‌గా భారత్ అండర్‌-19 జట్టు ఒక్కమ్యాచ్ ఓడిపోకుండా వాల్డ్ కప్‌ను గెలుచుకుంది.

- Advertisement -