రాహుల్ గాంధీకి నోరు జారడం కొత్తేం కాదు. తాజాగా ఆయన యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మరోసారి పప్పులో కాలేశారు. రాహుల్ ప్రసంగం అక్కడివారిని బాగానే ఆకట్టుకున్నా.. మధ్యలో మళ్ళీ పొరపాటు చేశారు.
సదరు కార్యక్రమంలో భాగంగా అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. ఆయన భారత లోక్‌సభలో సీట్ల సంఖ్య 546 అని చెప్పారు.
వాస్తవానికి లోక్‌సభలో రెండు నామినేటెడ్ సీట్లతో కలిపి మొత్తం 545 స్థానాలు ఉంటాయి. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంత ముఖ్యమైన విషయం తెలియని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.
దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్న వ్యక్తికి మన చట్టసభలో మొత్తం స్థానాల సంఖ్య కూడా తెలియదా అంటూ ఆయనపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంతేకాకుండా రాహుల్ ప్రసంగంలో కనీసం ఒక్క తప్పయినా ఉంటుందని అంటున్నారు. ఇదిలాఉంటే… ప్రతిసారీ తప్పుచేస్తూ.. నాలుకకొరుక్కోవడం రాహుల్‌కు ఉన్న తిక్క కాబోలు. అందుకే ఇలా లెక్కతప్పుతున్నారేమో. ఏదేమైనా …ఎంత తిక్కున్నా…లెక్కలేకపోతే కష్టమే సుమీ..!