కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. యూపీ ఎన్నికల్లో భాగంగా విస్తృత ప్రచారం చేస్తున్న రాహుల్‌పై సీతాపూర్లో రోడ్ షో నిర్వహిస్తున్న రాహుల్ గాంధీపై ఓ ఆగంతకుడు చెప్పు విసిరాడు. ఓపెన్ టాప్ జీపుపై ర్యాలీగా వెళుతున్న ఆయనపై దుండగుడు షూ విసరగా, అది కాస్త రాహుల్ తలకు తగిలింది.
కాగా ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ జరిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం మళ్లీ రాహుల్ గాంధీ తన రోడ్ షోను కొనసాగించారు. కాగా షూ విసిరిన వ్యక్తి జర్నలిస్ట్ అనూప్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. యువకుడికి ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలున్నాయా అనే విషయంపై కూడా పోలీసులు వివరాలు రాబడుతున్నారు. ఆ సమయంలో అక్కడ కొంత సేపు ఉద్రిక్తత ఏర్పడింది.ఆ తర్వాత కాసేపటికి రాహుల్ గాందీ తన యాత్రను కొనసాగించారు.
బూటు విసిరిన ఘటనపై రాహుల్ ఘాటుగా స్పందించారు. బీజేపీ,ఆరెస్సెస్ కావాలంటే ఎన్ని బూట్లైనా విసురుకోవచ్చని…తాను భయపడనన్నారు. ఇలాంటి చర్యలు నా మీద ప్రభావం చూపవలేవని…మీ బలహీనతకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Local hurls a shoe towards Congress VP Rahul Gandhi during his road show in Sitapur(UP),detained by police pic.twitter.com/oU3YsB3Fru
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 26, 2016