విశాఖలో రహేజా భారీ పెట్టుబడులు

6
- Advertisement -

విశాఖపట్నంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రహేజా ముందుకొచ్చింది. రూ. 2,172 పెట్టుబడులు పెడుతామని ప్రకటించగా ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆసక్తి కనబర్చింది.

ప్రాజెక్టు అమలుకు మధురవాడ ఐటీ హిల్ నంబరు-3లో 27.10 ఎకరాలు కేటాయించా లని ప్రభుత్వాన్ని కోరింది రహేజా గ్రూప్. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,681 మందికి ఉపాధి లభించనుంది.

అలాగే అమరావతి భూ సమీకరణకు 40.25 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారు. స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించగా కమిషనర్ కె.కన్నబాబు చర్చలు సఫలం అయ్యాయి. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు.. ఇతర రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. పెనుమాకలో 28.25 ఎకరాల భూమి ఇచ్చారు 14 మంది రైతులు. రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కమిషనర్ కన్నబాబు.

Also Read:BB9:కెప్టెన్ కంటెండర్లు వీరే!

- Advertisement -