ఆకట్టుకుంటున్న ‘రహస్యం ఇదం జగత్‌’ టీజర్‌!

0
- Advertisement -

కొత్తదనంతో కూడిన చిత్రాలను, వైవిధ్యమైన కథలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరించడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఇక వాళ్లతో ఆసక్తిని కలిగించే సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌ అంటే.. అందునా మన పురాణాలు, ఇతిహాసాల గురించి ఏదైనా అంశంతో రూపొందిన చిత్రమంటే ఎంతో ఆసక్తితో చూస్తారు. సరిగ్గా అలాంటి జానర్‌లోనే రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. నవంబరు 8న చిత్రం విడుదల కానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రమోషన్‌ల్‌ కంటెంట్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ గ్లింప్స్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలోని డల్లాస్‌లో విడుదల చేశారు మేకర్స్‌. తొలిసారిగా ఓ తెలుగు చిత్రం అమెరికాలో టీజర్‌ విడుదల చేయడం ఇదే తొలిసారి. డల్లాస్‌లోని యూనివర్శిటి ఆఫ్‌ టెక్సాస్‌ డల్లాస్‌లో జరిగింది. అక్కడ వున్న క్యాంపస్‌ మూవీ థియేటర్‌లో టీజర్‌ ఆవిష్కరణ జరిగింది. ఈ వేడుకలో యూనివర్శిటి స్టూడెంట్స్‌తో పాటు అమెరికాలోని సినీ ప్రేమికులు, తానా నాటా అసోసియేషన్‌ ప్రతినిథులతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్‌ సభ్యులు కూడా హాజరయ్యారు.

Also Read:పాడుతా తీయగా…టాలీవుడ్‌లోకి 30కి పైగా సింగర్స్ ఎంట్రీ

ఇప్పటి వరకు యూఎస్‌లో ఇలాంటి ఫంక్షన్‌ జరగడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఎత్తున్న ఆడియన్స్‌ హాజరయ్యారు. ఇక టీజర్‌ను గమనిస్తే సైన్స్‌ ఫిక్ష్‌న్‌కు మైథాలాజికల్‌ అంశాలతో పాటు థ్రిల్లింగ్‌ అడ్వెంచెరస్‌ను ఇండియన్‌ హిస్టారికల్‌ అంశాలను వెలికితీసే టీమ్‌కు ఎదురైన పరిస్థితులతో ఈ చిత్రం రూపొందుతున్నట్లుగా అనిపిస్తుంది. టీజర్‌ చూస్తుంటే అందరిలో సినిమాపై మంచి బజ్‌, ఇంట్రెస్ట్‌ కలుగుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా ఇలాంటి విభిన్నమైన, కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలనే నేడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ ”మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఆసక్తికరమైన పాయింట్‌ను తీసుకొని సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథలాజికల్‌ అంశాలకు మంచి ట్విస్ట్‌లు జోడించి ఈ చిత్రం రూపొందించాం. ముఖ్యంగా మన శ్రీచక్రం, శ్రీ యంత్రం, మన చారిత్రాత్మక చరిత్ర గురించి చెబుతున్న పాయింట్‌ అందరికి గూజ్‌బంప్స్‌ తీసుకొచ్చే విధంగా వుంటుంది. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఆడియన్స్‌ ఇంట్రెస్ట్‌ కలిగించే అంశాలతో పాటు స్టనింగ్‌ వుండే విజువల్స్‌ కూడా ఈ చిత్రంలో వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం అందర్ని సర్‌ఫ్రైజ్‌ చేస్తుంది. నవంబరు 8న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు.

- Advertisement -