హాయ్ జగన్…వైసీపీ అధినేతతో రఘురామరాజు

32
- Advertisement -

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో కనిపించిన వెంటనే వైఎస్ జగన్‌ని పలకరించారు టీడీపీ ఎమ్మెల్యే రఘురామరాజు.

ప్రతిరోజు అసెంబ్లీకి రా.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు. అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. మీరే చూస్తారుగా అని బదులిచ్చారు జగన్.అసెంబ్లీ హాల్‌లో జగన్‌ భుజంపై చేయి వేసి కాసేపు మాట్లాడారు రఘురామ కృష్ణం రాజు.

తనకు జగన్ పక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరారు రఘురామ. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ వెళ్లారు కేశవ్.రఘురామను పలకరించారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇక సభలో జగన్ పక్కనే కూర్చున్నారు ఆర్ఆర్ఆర్.

Also Read:Elon Musk: ఏఐ ఫ్యాషన్ షో, మస్క్‌ ట్వీట్‌ వైరల్

- Advertisement -