జనసేన గూటికి రఘురామ..?

37
- Advertisement -

వైసీపీ రెబెల్ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణరాజు ఏపీ రాజకీయాల్లో తరచూ చర్చల్లో నిలుస్తుంటారు. నిత్యం వైసీపీ నేతలపై, వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించే రఘురామ.. ఎలాంటి వ్యాఖ్యలు చేసిన హాట్ హాట్ చర్చలకు దారి తీస్తుంటాయి. ప్రస్తుతం వైసీపీలోనే ఉంటూ అదే పార్టీకి యాంటీ గా ఉన్న ఆయన నెక్స్ట్ ఏ పార్టీ గూటికి చేరతాడనేది ఆసక్తికరంగా మారింది. గత కొన్నాళ్లుగా ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉందని వార్తలు గట్టిగా వినిపిస్తూ వచ్చాయి ఎందుకంటే ఆయన డిల్లీలోనే ఉండడంతో అక్కడ బిజెపి పెద్దలతో ఆయన టచ్ లో ఉంటున్నారని, సమయం చూసుకొని ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని గుసగుసలు వినిపించాయి. .

ఇక మరి కొన్నాళ్లు ఆయన టిడిపిలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. ఏపీలో వైసీపీ తరువాత బలమైన పార్టీ కావడంతో టీడీపీలో చేరితే తన రాజకీయ భవిష్యత్ కు ఢోకా ఉండదనే ఉద్దేశంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారనే చర్చ జోరుగా సాగింది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆయన జనసేనలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారట. ఇటీవల పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు రఘురామ మద్దతు పలుకుతూ వస్తున్నారు.

Also Read:రైతులను చావగొట్టిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీదే..

వాలెంటరీ వ్యవస్థపై పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతల నుంచి తవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పవన్ చేసిన వ్యాఖ్యలలో ఎలాంటి తప్పు లేదని తరచూ పవన్ కు మద్దతు తెలిపే ప్రయత్నం చూస్తున్నారు. దీంతో రఘురామ వైఖరి చూస్తుంటే పవన్ దృష్టిలో పడేందుకే ప్రయత్నిస్తున్నారా అనే సందేహాలు పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ జనసేనలో చేరేందుకు రఘురామ ఆసక్తి చూపితే పవన్ ఆహ్వానిస్తారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. అయితే జనసేన ప్రస్తుతం ఏపీలో రైజింగ్ పార్టీగా ఉండడంతో రఘురామ ఎంట్రీ ఆయనకు మరియు జనసేనకు రెండు విధాలుగా ఉపయోగమే అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి రఘురామ చూపు ఎటువైపు ఉందో చూడాలి.

Also Read:హిట్ కోసం పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్న హీరో!

- Advertisement -