గత కొన్నాళ్లుగా తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. పార్టీలోని కీలక నేతలందారు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, తాజా పరిస్థితులను చక్కదిద్దెందుకు అధిష్టానం తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ చేయడం వంటి పరిణామాలను చూస్తుంటే.. బీజేపీలో ముసలం నిజమేననే అభిప్రాయం కలుగక మానదు. అయితే తమలో ఎలాంటి విభేదాలు లేవని, తామంతా ఒక్కటేనని పార్టీ నేతలు తరచూ చెబుతున్నప్పటికి విభేదాలు మాత్రం అప్పుడప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు పోలిటికల్ హిట్ పెంచుతున్నాయి.
Also Read:అధ్యక్ష పదవికి నేను అర్హుడినే:రఘునందన్
గత కొన్నాళ్లుగా అధ్యక్ష పదవి మార్పుపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమేనని ఆయన స్పష్టం చేశారు. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్ కి వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తూ విభేదాలను బయటపెట్టారు రఘునందన్. పార్టీలో పదేళ్లుగా కష్టపడుతున్నానని అధ్యక్ష పదవికి తాను కూడా అర్హుడనే అంటూ పదవిపై మనసులో మాట బయటపెట్టారాయన. దీంతో అధ్యక్ష పదవిపై బీజేపీ నేతల్లో ముసలం స్పష్టంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంచితే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఊహించని రీతిలో పార్టీలో అసంబద్దత ఏర్పడడం అధిష్టానాన్ని తీవ్రంగా కలవర పెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదవుల విషయంలో ముసుగులో గుద్దులాటలు వీడి బహిర్గతం అవుతున్న నేపథ్యంలో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థంకాక బీజేపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ ఏ పదవి కట్టబెట్టిన లేదా పదవుల నుంచి తీసివేసిన వ్యతిరేకత తప్పెలాలేదు. మరి ఈ అంతర్గత పోరు నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందో చూడాలి.
Also Read:ఎన్సీపీ నాశనం.. బీజేపీ కుట్రే!