నాని..ది పారడైజ్‌లో రాఘవ్

4
- Advertisement -

నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ది పారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని భారీగా నిర్మిస్తున్నారు. దసరా బ్లాక్ బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రం కోసం మరోసారి చేతులు కలిపారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆర్ఎఫ్సీలో జరుగుతోంది. స్పెషల్ గా వేసిన మ్యాసీవ్ సెట్ లో ఫైట్ మాస్టర్ రియల్ సతీష్ సూపర్విజన్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ హై-ఐన్‌టెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రియల్ సతీష్ మాస్టర్‌తో పాటు ఫారిన్ స్టంట్ మాస్టర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా ఉండనుంది.

‘ది పారడైజ్’ గ్లోబల్ లెవెల్‌కు వెళ్లబోతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ 8 భాషలలో విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ సెన్సేషనల్ చిత్రం ‘కిల్’ విలన్ నటుడు రాఘవ్ జుయల్ జాయిన్ అయ్యారు. రాఘవ్ పాత్రకు సంబంధించిన లుక్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Also Read:పవన్ ఓ అనాథ…ఇదే వీరమల్లు కథ!

- Advertisement -