లాక్ డౌన్ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసే ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక తండ్రిలా, పెద్దన్నలా వ్యవహరించి రాష్ట్ర ప్రజానీకానికి ధైర్యంగా నిలిచారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు.
లాక్ డౌన్ లో కరోనా పై హైరానా చెందొద్దు.. కేసీఆర్ ఉండంగా భాదపడకురా నాన్న… అంటూ శేరిలింగంపల్లి డివిజన్ సురభి కాలనీకి చెందిన ఆర్. వెంకట్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో జబర్థస్త్ ప్రముఖ నటుడు టి. మురళీధర్ ఆలపించిన కేసీఆర్ పాటను శనివారం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ విడుదల చేశారు.
భాస్కర్ పదకోశాలు అందించగా వి. సత్య శ్రీనాథ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ లాక్ డౌన్ లో కేసీఆర్ గారు విభిన్న ఆలోచనలతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజల శ్రేయస్సు కోసం కొన్ని సార్లు కఠిన చర్యలకు సైతం వెనకాడకుండా తండ్రిలా వ్యవహరించడం జరిగిందన్నారు.
వీటన్నింటికి కంటికి కట్టేలా చూపిస్తూ పాటను రూపొందించిన వెంకట్ రెడ్డి బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పాటను ఆస్వాదించాలని రాగం నాగేందర్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్. వెంకట్ రెడ్డి, సంగీత దర్శకుడు వి. సత్య శ్రీనాథ్, రచయిత భాస్కర్ తదితరులు ఉన్నారు.