రాగల 24గంటల్లో 100రోజులు ఆడాలిః వైవి సుబ్బారెడ్డి

254
Ragala 24gantallo
- Advertisement -

టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, మామా మంచు అల్లుడు కంచు, ఢమరుకం, వంటి హిట్ చిత్రాలను రూపొందించిన శ్రీనివాస్ రెడ్డి “రాగల 24 గంటల్లో” వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి వస్తోన్నారు.. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రదారులుగా ఈ చిత్రంలో నటించారు. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రఘు కుంచె సంగీతాన్ని అందించారు. కాగా ఈ చిత్రంలోని హీరోయిన్ ఇంట్రడక్షన్ “నారాయణతే నమో నమో” లిరికల్ వీడియో పాటని తితిదే బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ముఖ్యఅతిధిగా విచ్చేసి లాంచ్ చేశారు.

తితిదే బోర్డ్ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీనివాసరెడ్డి 20 సంవత్సరాలనుండి స్నేహితుడు. వెంకటేశ్వర స్వామి వారి కీర్తన పాటని నాతో ఎందుకు రిలీజ్ చేయించారో పాట చూశాక నాకు అర్థం అయింది. పాటని విజువల్ గా చక్కగా చిత్రీకరించారు. మంచి హిట్ అవుతుంది. దానికి మించి రెండింతలు సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. ఆలీ, రఘుబాబు, మా పార్టలో వున్నారు. వారందరి సూచనలతో ఆంద్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయడానికి అన్నివిధాలుగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుముఖంగా వున్నారు.. ఈ సినిమా వందరోజులు ఆడాలని.. నిర్మాత శ్రీనివాస్ కు, నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డికి మంచి జరగాలని.. ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను.. అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…20 ఏళ్లుగా నా దైవం, పితృసమానులు సుబ్బారెడ్డి గారితో నా అనుబంధం కొనసాగుతుంది. దివంగత నేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి మరణాంతరం ఆ కుటుంబానికి, పార్టీకి వెన్నుమూకగా ఉండి ఎన్నో సేవలందిస్తున్నారు సుబ్బారెడ్డి గారు. మా చిత్రంలోని పాటను ఆయనే రిలీజ్ చెయ్యాలని వైట్ చేశాం. అది ఈరోజు జరిగింది. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు దీవెనలు మాకు వుంటాయని ఆశిస్తున్నా.. యస్విబిసి బోర్డ్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు నాకు అప్పగించారు.. వారు నామీద పెట్టిన నమ్మకానికి నిజాయితీగా పనిచేసి మంచిపేరు వచ్చేలా చేస్తానని హామీ ఇస్తున్నాను..అన్నారు.

- Advertisement -