‘రాగల 24 గంటల్లో’ టీజర్..!

404
- Advertisement -

వినోదాత్మక చిత్రాలు ‘అదిరిందయ్యా చంద్రం’,’టాటా బిర్లా మధ్యలో లైలా’,’యమగోల మళ్ళీ మొదలైంది’,’బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’తో నవ్వించి… సోషియో ఫాంటసీ ‘ఢమరుకం’తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్  చిత్రం ‘రాగల 24 గంటల్లో’‌‌.

Ragala 24 Gantallo Movie Teaser Release Date

ఈ సినిమాలో సత్యదేవ్,ఇషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా ప్రముఖ కథానాయకుడు ‘శ్రీరామ్‌’, ‘పైసా వసూల్‌’ ఫేమ్‌ ముస్కాన్‌ సేథ్, గణేశ్‌ వెంకట్రామన్‌ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్‌ కానూరు నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 25న, చిత్రాన్ని అక్టోబర్ 18న ‌ విడుదల చేయనున్నారు.

Ragala 24 Gantallo Movie

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ కానూరు మాట్లాడుతూ “ఇటీవల పోస్టర్ నెంబర్ 1, పోస్టర్ నంబర్ 2 అని రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశాం. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అలాగే, ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందింది. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది.ఈ నెల 25న టీజర్ విడుదల చేస్తాం. వచ్చే నెల 18న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం. స్క్రీన్ ప్లే బేస్ డ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సినిమాలో నటీనటులందరూ అద్భుతంగా చేశారు‌.

Ragala 24 Gantallo Movie

ప్రముఖ హాస్యనటుడు కృష్ణభగవాన్ మా చిత్రంతో మాటల రచయితగా పరిచయం అవుతున్నారు. ఆయన రాసిన మాటలు, రఘు కుంచె బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో పాటు, ‘గరుడ వేగ’ఫేమ్‌ అంజి కెమెరావర్క్‌ సినిమాకి హైలెట్‌’’అన్నారు. కృష్ణభగవాన్, రవిప్రకాశ్, రవివర్మ, ‘టెంపర్’ వంశీ, అజయ్, అనురాగ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.

- Advertisement -