14వ సారి…విజేతగా నాదల్

87
nadel
- Advertisement -

తాను మట్టికోట రారాజునని మరోసారి నిరూపించాడు రఫేల్ నాదల్. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ని 14వ సారి గెల్చుకుని సత్తాచాటాడు. ఫైనల్లో నార్వే ఆటగాడు, ఎనిమిదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌‌ను చిత్తుగా ఓడించాడు.

వరుసగా మూడు సెట్లు 6-3, 6-3 6-0 తేడాతో విజయదుందుభీ మోగించాడు. ఇక రఫేల్ కెరీర్‌లో మొత్తం గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ సంఖ్య 22కి పెరిగింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వని నాదల్…బలమైన షాట్లతో విరుచుకపడ్డాడు.

ఒక ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి నార్వే ఆటగాడిగా రూడ్ ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 23 ఏళ్ల రూడ్‌ ఏ మేజర్‌ టోర్నీలోనూ నాలుగో రౌండ్‌ దాటలేకపోయాడు.

- Advertisement -