టెన్నిస్‌కు ర‌ఫెల్ నాద‌ల్ వీడ్కోలు..

6
- Advertisement -

టెన్నిస్‌కు గుడ్ బై చెప్పాడు దిగ్గ‌జ ఆట‌గాడు ర‌ఫెల్ నాద‌ల్. ఓటమితో టెన్నిస్‌కు గుడ్ బై చెప్పాడు నాదల్. డేవిస్ క‌ప్ తన కెరీర్‌లో చివరిదని ప్రకటించాడు నాదల్. ఈ నేపథ్యంలో క్వార్ట‌ర్స్ ఫైన‌ల్‌లో నెద‌ర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓడిపోవ‌డంతో అత‌డి కెరీర్ ముగిసింది.

సింగిల్ మ్యాచ్‌లో బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ (నెదర్లాండ్స్‌) చేతిలో నాద‌ల్ 4-6, 4-6 తేడాతో ఓడిపోయాడు. అయితే.. కార్లోస్ అల్క‌రాజ్ 7-6 (7/0), 6-3తో టాలోన్ గ్రీక్స్‌పూర్‌ను ఓడించాడు. దీంతో 1-1తో స్పెయిన్‌, నెద‌ర్లాండ్స్ స‌మంగా నిలిచాయి. నిర్ణ‌యాత్మ‌క డ‌బుల్స్‌లో అల్కారజ్, మార్సెల్ గ్రానోల్లర్స్ ఓడిపోయారు. దీంతో నెద‌ర్లాండ్స్ 2-1 తేడాతో సెమీ ఫైన‌ల్‌లో అడుగుపెట్టింది.

14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో ఛాంపియన్‌గా నిలిచాడు నాదల్.

Also Read:అల్పపీడనం.. ఏపీకి తుపాను ముప్పు!

- Advertisement -