విక్రమాదిత్య వచ్చేశాడు…!

124
prabhas
- Advertisement -

బర్త్ డే కానుకగా విక్రమాదిత్య వచ్చేశాడు. అయితే మనలో ఒకడు కాదంటూ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు ప్రభాస్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్ టీజర్ రిలీజ్‌ అయింది.

నా పేరు విక్రమాదిత్య. నాకు అన్నీ తెలుసు కానీ మీకు ఏమీ చెప్పను. నేను మీలో ఒకడిని కాదు. అలాగని దేవుడిని కాదు అంటూ ప్రభాస్ చెప్పిన ప్రతీ డైలాగ్ ఆకట్టుకుంది. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం 2022 జనవరి 14న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. గోపికృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్, టి-సిరీస్ బ్యానర్‌ లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.

- Advertisement -