- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండగా ఈ ప్రభావం సినీ ఇండస్ట్రీపై స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి రేసులో పెద్ద సినిమాల విడుదల ఉండగా ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే థర్డ్ వేవ్ ప్రభావంతో ఇప్పుడు ఒక్కొక్క సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వాయిదా పడగా తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ కూడా అదేబాటలో నడిచింది.
డైరెక్టర్ రాధా కృష్ణ కుమార్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా ఉన్నాయి, మనస్సులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా – మన ఆశలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. సురక్షితంగా ఉండండి, ఉన్నతంగా ఉండండి- టీమ్ రాధేశ్యామ్” అంటూ ట్వీట్ చేశాడు.దీంతో సినిమా విడుదల వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది.
- Advertisement -