- Advertisement -
ఎట్టకేలక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయింది. కరోనా కారణంగా జనవరి 14న విడుదల కావాల్సిన రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్‌చేశారు మేకర్స్. మార్చి 11న సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకురానుందని వెల్లడించారు.
రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఒక జ్యోతిష్య నిపుణుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
- Advertisement -

