ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంయుక్త నిర్మాణంలో రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. మరీ ఈ సినిమాతో ప్రభాస్…ఆ అంచనాలను నిలబెట్టాడా లేదా చూద్దాం..
కథ:
1976లో పరిస్థితుల కారణంగా ఇటలీకి పారిపోతాడు విక్రమ్ ఆదిత్య (ప్రభాస్). ప్రపంచంలోని అనేక భవిష్యత్ సంఘటనలను అంచనా వేయడంతో అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతాడు. ఈ క్రమంలో ప్రేరణ(పూజ)ని కలిస్తాడు. తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ప్రేరణ కూడా ఆదిత్యను ఇష్టపడతుంది. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ తెలుస్తోంది. దీంతో ఆ సమస్య నుండి ఆదిత్య ఎలా గట్టెక్కాడు…విధితో సవాల్ చేసి ప్రేరణ ప్రేమను ఎలా గెలుస్తాడు అన్నదే రాధే శ్యామ్ కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ విజువల్స్,ప్రభాస్-పూజా కెమిస్ట్రీ,సాంకేతిక,నిర్మాణ విలువలు. విక్రమాదిత్య పాత్రలో ఒదిగిపోయాడు ప్రభాస్. అల్ట్రా స్టైలిష్‌గా తెరపై ప్రభాస్ నటన సూపర్బ్. క్లాసికల్ నటనతో డార్లింగ్ ఫ్యాన్స్‌ను మెప్పించాడు. ప్రేరణగా పూజా హెగ్డే మెప్పించింది. తెరపై ప్రభాస్‌తో పూజా కెమిస్ట్రీ చూడటానికి కన్నుల పండువగా ఉంది. కృష్ణం రాజుతో పాటు మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు వందశాతం న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ కథ,సెకండాఫ్‌లోని కొన్ని సన్నివేశాలు, నేరేషన్.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. ముఖ్యంగా విజువల్స్ ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయి. VFX ఎఫెక్ట్స్ బాగున్నాయి. సంగీతం,సినిమాటోగ్రఫీ బాగుంది. తమన్ సంగీతం సినిమాకు మరింత ప్లస్ పాయింట్‌గా మారింది. ఇక నిర్మాణ విలువలు సినిమాను మరో స్ధాయికి తీసుకెళ్లాయి.
తీర్పు:
డార్లింగ్ సినిమా తర్వాత లవ్ జోనర్‌తో ప్రభాస్ నటించిన చిత్రం రాధేశ్యామ్. లవర్ బాయ్‌గా ప్రభాస్ నటన సినిమాకు ప్లస్ పాయింట్‌గా మారగా విజువల్స్,సంగీతం ఆకట్టుకుంటాయి. అయితే కథపై కాస్త దృష్టిసారిస్తే బాగుండేది. స్వచ్ఛమైన రొమాంటిక్ డ్రామాను ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చేందుకు రాధాకృష్ణ చేసిన ప్రయత్నం బాగుంది. కానీ ఇంకాస్తా దృష్టిపెడితే సినిమా మరో లెవల్‌లో ఉండేది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం రాధేశ్యామ్.
విడుదల తేదీ:11/04/2022
రేటింగ్:2.5/5
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే
సంగీతం: తమన్
నిర్మాత: యువీ క్రియేషన్స్
దర్శకుడు – రాధా కృష్ణ కుమార్