పాన్ ఇండియా సెన్సేషన్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 11న వరల్డ్ వైడ్‌గా భారీ లెవల్‌లో విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 79 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. బాక్సాఫీస్ ను ‘రాధే శ్యామ్’ శాసిస్తోందని యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. తమ చిత్రాన్ని హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొంది.
మరోవైపు తొలి రోజు వసూళ్లలో అల్లు అర్జున్ చిత్రం ‘పుష్ప’ను ‘రాధే శ్యామ్’ బీట్ చేసింది. తొలి రోజున ‘పుష్ప’ రూ. 71 కోట్లు వసూలు చేసింది. ‘పుష్ప’ చిత్రానికి కూడా తొలి రోజున మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత పుంజుకుని ఏకగా రూ. 330 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదే రీతిలో ‘రాధే శ్యామ్’ కూడా భారీ వసూళ్లను రాబడుతుందేమో వేచి చూడాలి.
రాధే శ్యామ్ మాంచి విజువల్ ఫీస్ట్ అని అందరూ చెప్పుకోవడం ఆసక్తికరం. ప్రభాస్ లుక్స్, స్టైలింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ప్రభాస్, పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఈ సినిమాకు మరో ప్రధానమైన ప్లస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. క్లైమాక్స్ అత్యద్భుతంగా ఉంది. సాధారణంగా ప్రేమ కథల్లో ఈ తరహా క్లైమాక్స్‌ను ఎవరూ ఊహించరు.