వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ నటుడు శర్వానంద్. శతమానంభవతి సినిమా హిట్‌తో మంచి దూకుడు మీదున్న ఈ కుర్రహీరో తన నెక్ట్స్ సినిమా సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాధ అనే టైటిల్‌ను ఖరారు చేస్తు శివరాత్రి సందర్భంగా చిత్రయూనిట్ పోస్టర్ని విడుదల చేసింది.
మొత్తం ఖాకీ గెటప్.. నెత్తిన కిరీటం.. చేతిలో ఫ్లూటు.. చూస్తుంటే ఖాకీ డ్రస్సు వేసుకున్న కృష్ణుడిలా లేడు? అచ్చం అలాగే ఉన్నాడు. అంటే ఈ సినిమా కూడా బాబు బంగారం సినిమా తరహాలో ఒక ఖాకీ లవ్ స్టోరీ అనమాట. ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది.
వినూత్నమైన కథలతో, మంచి నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న శర్వానంద్, ఇంతకుముందు ఎన్నడూ చేయని ఒక వినోదభరితమైన పోలీస్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తారు. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. వేసవి సెలవుల్లో, ఉగాది (మార్చ్ 29) రోజున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
సమర్పకులు బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ, ” పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రం ఉంటుంది. నూతన దర్శకుడు చంద్రమోహన్ చెప్పిన కథ బాగుంది. రొమాన్స్, కామెడీ , యాక్షన్ సమపాళ్ళలో ఉండే మా సినిమా అటు క్లాస్ ప్రేక్షకులను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాత భోగవల్లి బాపినీడు. మొత్తానికి ఈ ఏడాది ఆల్రెడీ శతమానం భవతి సినిమాతో సక్సెఫుల్ గా ఖాతా ఓపెన్ చేసి.. ఇప్పుడు ఇలా రాధగా దూసుకొస్తున్నాడనమాట.