బాబోయ్.. బాలయ్యతో హాట్ బ్యూటీ

25
- Advertisement -

రచితా రామ్‌.. కన్నడ హాట్ హీరోయిన్‌‌, అయినప్పటికీ తెలుగులోనూ తనకంటూ ఓ ఇమేజ్‌‌ను తెచ్చుకుంది. నిజానికి తెలుగులో రచితా రామ్‌ పెద్దగా సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో రచితా రామ్‌ అంటే విపరీతమైన క్రేజ్. అందుకేనేమో.. టాలీవుడ్‌‌ లోనూ ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కొన్ని కథలు విన్న ఆమె.. తాజాగా తన కొత్త తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. బాలయ్య బాబుకు జంటగా కనిపించే క్రేజీ చాన్స్ అందుకుంది. బాలయ్య బాబు – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే కీలక షెడ్యూల్స్ పూర్తి చేసుకోబోతుంది ఈ మూవీ. తాజాగా ఇప్పుడీ సినిమాకు హీరోయిన్ గా రచితా రామ్‌ ను ఫిక్స్ చేశారు. మరి, బాలయ్య సరసన రచితా రామ్ తీసుకున్నారు అంటే.. ఆమె పాత్ర కచ్చితంగా బోల్డ్ గా ఉండబోతుంది. బోల్డ్ పాత్రలకు రచితా రామ్‌ పెట్టింది పేరు. ఎలాగూ బాబీ సినిమాల్లో ‘హీరోయిన్ అందాల ఆరబోత’ అనేది సాధారణమైన విషయం. కాబట్టి, రచితా రామ్‌ గ్లామర్ డోస్ ఓ రేంజ్ లో ఉంటుంది అని ఊహించుకోవచ్చు.

కాబట్టి, బాలయ్య సినిమాతో రచితా రామ్‌ టాలీవుడ్ లో పాగా వేయబోతుంది అనుకోవచ్చు. మరోపక్క హాట్ హాట్ దుస్తుల్లో ఉన్న రచితా రామ్‌ ఓల్డ్ ఫొటోలు కూడా ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ సినిమా కోసం ఓ పెద్ద హీరోయిన్ ను అనుకున్నారు. చివరకు, కన్నడ స్టార్ హీరోయిన్ అయిన రచితా రామ్‌ ఫైనల్ చేశారు. ఐతే, ఈ వార్త పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నట్టు ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్ పేరే వినిపిస్తోంది.

Also Read:పార్టీకి నో క్రెడిట్.. ఏంటిది షర్మిల?

- Advertisement -