నిరుద్యోగులకు శుభవార్త.. పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ..

194
Rachakonda CP
- Advertisement -

తెలంగాణ సర్కారు భారీ ఉద్యోగ ప్రకటనకు సిద్ధమైంది. ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలను భారీ సంఖ్యలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 18,334 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనుంది. ఈనేపథ్యంలో పోలీసు శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పోలీసు ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 5 సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తుదారులు రాచకొండ పోలీసులు రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌చేసి లేదా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు నేరుగా వెళ్లి పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎస్సెస్సీ, ఇంటర్‌ మెమోలు, ఆధార్‌కార్డు, నివాస, కుల ధ్రువీకరణ జిరాక్స్‌ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఉచిత శిక్షణ శిబిరాలను మల్కాజిగిరి, కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్‌, ఎల్బీనగర్‌, ఇబ్రహీంపట్నంలో నిర్వహించనున్నారు. ఆయా విద్యార్హతలతో పాటు పురుషులు 167.6 సెంటీమీటర్లు, మహిళలు 152.5 సెంటిమీటర్ల ఎత్తు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

- Advertisement -