- Advertisement -
నూతన సంవత్సరం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పబ్స్ వాళ్ళను పిలిచి మాట్లాడాము.. డ్రగ్ ఫ్రీ సెలబ్రేషన్ కొనసాగుతుందన్నారు.రాత్రి 1 గంటల వరకు పర్మిషన్ ఉందని అయితే
రాత్రి 10కి ఫ్లై ఓవర్స్ బంద్ చేస్తామని చెప్పారు సీపీ.
మోహన్ బాబు విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. 24వరకు గడువు ఉంది.. తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. బౌన్సర్ల విషయంలో సహించేది లేదు.. పోలీస్ యంత్రాంగం సీరియస్ గా ఉంది. మీ సలహాలు సూచనలు కూడా తెలపండన్నారు. అమోయ్ కుమార్ కేసులో విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.
Also Read:సారీ చెప్పిన సీవీ ఆనంద్
- Advertisement -