పోర్ట్ ఎలిజెబిత్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా విజయం దిశగా అడుగులు వేస్తోంది. సఫారీ బౌలర్ రబాడ ధాటికి కంగారులు ఖంగుత్తిన్నారు. నిప్పులు చెరిగే బంతులతో రబాడ ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన రబాడ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేశాడు. పేకమేడలా ఆసీస్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చిన రబాడ…రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీశాడు.
రబాడ ధాటికి ఆసీస్ ఏ దశలోనూ కొలుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులు మాత్రమే చేసి దక్షిణాఫ్రికా ముందు 101 పరుగుల స్వల్ప టార్గెట్‌ని విధించింది.
ఇప్పటివరకు 28 టెస్టులు ఆడిన రబాడ ఒకే మ్యాచ్‌లో పది వికెట్లను నాలుగు సార్లు తీశాడు. ఓవరాల్‌గా ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన మూడో సఫారీ బౌలర్‌గా నిలిచాడు. రబాడ కంటే ముందు స్టెయిన్ 86 టెస్టుల్లో 5 సార్లు 10 వికెట్లు తీయగా, ఎన్తినీ 101 టెస్టుల్లో 4 సార్లు 10 వికెట్లు తీశాడు.